ఆకలి మహా భారతం. రేపటి ప్రపంచాన్ని ఊహించి అందరూ భయపడటం ప్రస్తుత సమాజానికి మామూలు ఐపోయింది. మీ, మా మనందరి భయాన్ని నిజంచేస్తూ ఆ నిజాన్ని అబద్ధం చెయ్యడానికి సాహసమే పునాది అని నిరూపిస్తూ నా ఈ చిన్ని, కల్పిత పాత్రల కథ. 2029 లో . కరోనా మహమ్మారికి మన దేశం, పొరుగు దేశాలు, మొత్తం ప్రపంచం అన్నిరకాలుగా ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టపోయి ప్రాణాలు , ఆస్తులు , రాజకీయ బలగాలు, అన్ని కుప్పకూలి పోయిన సమయం అది సుమారు 10 నుంచి 15 సవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ప్రజా సమూహాలు కళకళ లాడుతున్న గతకాలాన్ని ఊహించుకొని ప్రస్తుత సమాజం ఇంటా బయట కన్నీళ్ల బిందెలు నింపుతుంది . అదే సమయంలో 9 ఏళ్ళ క్రితం అంటే 2020 మే, జూన్ నెలలలో పాకిస్థాన్ సరిహద్దుల నుంచి భారత దేశంలో మిడతల దండు ప్రవేశించింది. అలాగే ప్రస్తుతం అంటే 2029 లో ప్రపంచం మొత్తం మిడతల రాజ్యం ఐపోయింది . రైతులు పంటలు వెయ్యాలంటే గజగజ వణుకుతున్నారు . తెలుగు రాష్టాలు AP, తెలంగాణ ప్రాంతాలలో వ్యవసాయం పై ఆధారపడి 100 కి 78% ఉన్నారు. సిరిసంపదలు పేరు కలిగిన మహారాష్ట్ర, పంజాబ్ , హర్యానా వ్యవసాయ ర