జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకో!!







Desire, wish ,want మూడింటి
అర్థమూ కోరికే

కామం , ఇచ్చే, వాంఛ ,మోహం, అన్నా కోరికే...


బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత తాను తెలుసుకొంది "కోరికలే దుఃఖ హేతువులు" అని...


కోరికల్ని త్యజించిన వారికి దుఃఖం అనేది ఉండదు...

ఉప్పు , కారం తింటే తమో , రజో గుణాలు పుడతాయి...

అందుకే 

మునులు , తపస్సంపన్నులు తాజా కాయలు మాత్రమే సేవిస్తారు...

మునులు ఉన్నంత ప్రశాంతంగా సాటి మానవులు ఉండలేరు... 
కోరికల ప్రభావం చేత


కోరిక వలన మనిషికో బుద్ది పుడుతుంది....

"పుర్రె పుర్రెకో బుద్ధి,
జిహ్వ జిహ్వ కో రుచి"...

జిహ్వచాపల్యం చేత చేప గాలానికి చిక్కుతుంది...

కామం వలన మన మనసు అదుపు తప్పి తప్పు చేయమని ప్రొత్సహిస్తుంది..

"అన్నీ ఉన్నా దేని మీద మోహంపెంచుకోకూడదు" అంటారు శ్రీకృష్ణపరమాత్మ గీతలో....

ఇంద్రుని కంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు ధన్యుడు...

కోరికలు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి...

అందమైన ప్రతీది ఆశ కల్పిస్తుంది...
ఆరాట పడమంటుంది మనస్సు....

యవ్వనంలో చేసిన పాపాలు వార్థక్యంలో మన మెడకి చుట్టుకుంటాయి...

మనం కూడా కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి...

కోరికల వల్ల క్షణికానందం తప్ప మరేమీ ఉండదు...

కోరికల వల్ల అసంతృప్తి కలుగుతుంది....

కోరికలు అధికం అవ్వడం  చేత చేయకూడని పనులు (అధర్మమైన పాపపు పనులు చేయాల్సి వస్తుంది)

కోరిక కాస్తా కామం/మోహం గా మారితే మన మెదడు అదుపు తప్పి వావివరుసలు / చిన్న, పెద్దా తారతమ్యాలు మరచి ప్రవర్తిస్తారు.....

ఆ ఒక్క క్షణం కంట్రోల్ చేసుకోలేక జీవితాల్ని నాశనం చేసుకోవాల్సి ఉంటుంది కనుక "కోరికలతో జాగ్రత్త"


అవి కోరికలు కావు నీ కొంపముంచే ఆలోచనలు...

అవి నీ కంటి మీద కునుకు లేకుండా 
చేసే చెడ్డ పనులు...

నీ వ్యక్తిత్వం చంపేసే అవకాశాలు....



కావున 

ధర్మబద్ధమైన కోరికలతో జీవనం సాగిద్దాం....

సుఖసంతోషాలతో ఉందాం....

Comments

Popular posts from this blog

Build solid foundation!!

Educational system in our state @telangana