ఆకలి మహా భారతం.

                             ఆకలి మహా భారతం.



       రేపటి ప్రపంచాన్ని ఊహించి అందరూ భయపడటం
ప్రస్తుత సమాజానికి మామూలు ఐపోయింది. మీ, మా మనందరి భయాన్ని నిజంచేస్తూ ఆ నిజాన్ని అబద్ధం చెయ్యడానికి సాహసమే పునాది అని నిరూపిస్తూ నా
ఈ చిన్ని, కల్పిత పాత్రల కథ.

    2029 లో .
  కరోనా మహమ్మారికి మన దేశం, పొరుగు దేశాలు,   మొత్తం ప్రపంచం అన్నిరకాలుగా ముఖ్యంగా ఆర్థిక పరంగా  నష్టపోయి ప్రాణాలు , ఆస్తులు , రాజకీయ బలగాలు, అన్ని కుప్పకూలి పోయిన సమయం అది
సుమారు 10 నుంచి 15 సవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ప్రజా సమూహాలు  కళకళ లాడుతున్న గతకాలాన్ని ఊహించుకొని ప్రస్తుత సమాజం ఇంటా బయట కన్నీళ్ల బిందెలు నింపుతుంది .

అదే సమయంలో 9 ఏళ్ళ క్రితం అంటే 2020 మే, జూన్ నెలలలో పాకిస్థాన్ సరిహద్దుల నుంచి భారత దేశంలో మిడతల దండు ప్రవేశించింది.
అలాగే  ప్రస్తుతం అంటే 2029 లో ప్రపంచం మొత్తం మిడతల రాజ్యం ఐపోయింది . రైతులు పంటలు వెయ్యాలంటే గజగజ వణుకుతున్నారు . తెలుగు రాష్టాలు AP, తెలంగాణ ప్రాంతాలలో వ్యవసాయం పై ఆధారపడి 100 కి 78%  ఉన్నారు. సిరిసంపదలు పేరు కలిగిన మహారాష్ట్ర, పంజాబ్ , హర్యానా వ్యవసాయ రాష్ట్రాలు ధాన్యాలను మన దేశానికి అందిస్తున్నాయి కానీ దేశ ధాన్యాగారంలో ధాన్యాలు రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రపంచం మిడతలతో  యుద్ధం చేస్తుంది.
అలాంటి పరిస్థితులలో AP కర్నూల్ జిల్లాలో రామయ్యా అనే 57 ఏళ్ల రైతు సాహసం చేసి తనకు ఉన్న 2 ఎకరాల పొలంలో వరి పంటవేశాడు. నారు పోసిన 14 నుంచి 15 రోజులలో వరిపంట మొత్తం మిడతల నివాసమైంది. పంట మొత్తం వరితల్లి స్మశానం అయింది.

  పంట వెయ్యడానికి ఎవ్వరూ సాహసం చేయ్యలేదు.
రైతులు భారీగా నష్టపోతున్నారని దేశం పంటల లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కాస్త పెరుగుతూ నెలలూ సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కొన్ని సడలింపులతో పంటల లాక్డౌన్ వేస్తూ వచ్చింది. దీని ప్రభావంతో దేశధాన్యాగారం ఖాళీ అయింది . మిడతల అంతానికి ఎల్లికాఫ్టర్ లలో అంతరిక్ష భాగం నుంచి విషపూరిత మందులు చల్లడం మెదలు పెట్టారు. మనుషులు చచ్చిపోతున్నారు కానీ మిడతలు ఖాళీ అవ్వడం లేదు. వ్యవసాయరంగం లాక్డౌన్ తో రైతులు వ్యవసాయ కూలీలు నోళ్లు ఎల్లబెట్టుకున్నారు. అన్నం పెట్టే రైతే ఆడుక్కుతినే పరిస్థితికి వచ్చారు. రోజురోజుకూ మిడతల ప్రభావం ఎక్కువై చెట్ల వైపు మరలి ప్రాణవాయువుఇచ్చే  వృక్షాలను తినేస్తున్నాయి. లేత పసిపిల్లపై వాలి గాయాలను చేస్తున్నాయ్

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలోమని చేతులెత్తేసింది. యుద్ధం చెయ్యడం తెలిసిన సరిహద్దు సైనికుడు
పురుగులతో యుద్ధం ఎలా చెయ్యాలో తెలియక గమ్మున కూర్చున్నాడు. కరోనాను తరిమిన వైద్యులు మిడతలను ఎలా గెంటాలో తెలియక చేతులు కట్టుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. దేవుడా అని పూజలు చేసే పూజారులు , హల్లా అని నమాజ్ చేసే ఖురాన్ ప్రేమికుడు , సుతులు సోత్రాలు చెల్లించే చర్చ్ ఫాదర్ అందరూ, అందరూ చేసేదేమిలేక కంట నీరు పెడుతుండ్రు. తినడానికి తిండిలేదు బాబూ అని బోరున ఏడ్చే కాలం అందరికి వచ్చింది. రోజుకు పదికూరలు తినే VIP,  పదిరోజులు ఒకే ఉల్లిపాయ గొడ్డు కారం తినే సామాన్యుడూ అందరూ ఆకలిలో సమాన భాగస్వాములు అయ్యారు. తిండి లేక గర్భవతులు పసిపిండాన్ని మోస్తూ కల్లుతిరిగి పడిపోయి కళ్ళు మూస్తున్నారు.

AC లో తిరిగే యజమానులు, పాలేగాళ్ళు రైతు ఇంటి ముందు లైను కడుతుండ్రు . ధాన్యం లేని రైతు కంట నెత్తురు కారుస్తుండు. భగవంతుడా తిండికోసం ఒకరినొకరు సంపుకొని  మాంసాన్ని కాల్చుకు తినడం ప్రారంభించారు. ఒకరికి ఎదురు పడాలంటే బిత్తరపోతున్న ఆకలి రాజ్యం మొదలైంది. ఇవన్నీ భరించలేని ఆకలికి తట్టులోలేని వాళ్లు ఉరేసుకొని అక్కడికక్కడే చస్తున్నారు. ఎక్కడ  ఏ టీవీలో చూసినా ఆకలి మరణమే . ప్రపంచాలు ఇరుగు పొరుగు దేశాలపై దాడులు చేస్తూ మనుషుల సేవాలను తింటున్నారు. అయ్యో ఆకలి ఇంతటి అనర్థం చేస్తుందా అని ప్రపంచం విలవిల లాడుతున్న సమయంలో .....

2031 లో

     కర్నూలో నష్టపోయిన రామయ్యా అనే రైతు తాను నమ్ముకున్న నేల తల్లి మిడతలకు బలి అవుతుంటే  తాను ప్రేమగా పెంచుకున్న పావూరం రెక్క విరిగి ఇంట్లో పడితే ఆ రక్తంతో ఆకలి భారతం అనే పద్యాన్ని రాశాడు . ఆ రెక్క విరిగిన పావురం ఇంటి నుంచి బయటకు వెళ్లి  కాస్త 2,3,4,5,6 మిడతాలను తినేస్తుంటే లోలోపల ఆలోచిస్తూ తన కొడుకు రాముతో ఇలా అన్నాడు TV రిపోటర్లను పిలిపించమన్నాడు . వెంటనే TV రిపోటర్స్ అందరూ కెమరాలతో వచ్చి నిలబడ్డారు . రామయ్యా మిడియాతో ఇలా మాట్లాడారు అందరూ అడవులకు వెళ్ళాలి జంతువులనుకాదు పక్షులను బలవంతంగా వలలు వేసి వేటాడి  వాటికి కృత్రిమంగా మందులువేసి 7 రోజులలో వాటికి గుడ్లు పెట్టేలా మందు వేసి  ఆగుడ్లును పక్షులుగా మార్చి మిడతలపై వదలాలి అని చెప్పారు .  

    మనం రేపో మాపో మిడతల ధాటికి చస్తున్నాం  మనం చచ్చే ముందు వాటిని చంపే పోదాం  రండి రండి రండి అని పాట పాడి ప్రజలను  రెచ్చ  గొట్టారు రామయ్యా.  రామయ్యా ఒక కవి. ప్రజలను చైతన్య వంతులుగా మార్చాలంటే తనకు చాలా ఇష్టం  ఎన్నో రకాల కవిత్వాలు కథలు, పద్యాలు , పాటలు రాసి ప్రజలకు యూటూబ్, వాట్సాప్, ట్విట్టర్ , ప్రతిలిపి, పేస్ బుక్ ల ద్వారా  వినిపించసాగాడు. తోటి కవులు కవిత్వాలు పద్యాలు రాయడం మొదలు పెట్టారు. వాటికి ప్రజలు చలించి అడవులకు బయలుదేరి ఆకులు అలుములూ తింటూ అన్ని రకాల పక్షులను వలలతో వేటాడి నెలరోజులకు రాష్టాలవారిగా మొత్తం దేశం ఒకే సారి కోట్లకు కోట్లు అన్ని రకాల పక్షులను వదిలారు.

మరికొందరు scientist లు ఆపక్షులకు ఆకలివేసే మందును పోసి మిడతలపై వదిలారు . పక్షులు అన్ని వాటి ఆకలికి మిడతలను తినడం మొదలు పెట్టాయి. రోజురోజుకూ మిడతాల సంఖ్య తగ్గిపోయింది .  2032- 33 సం..  లో  దేశం పూర్వ వైభవాన్ని పుంజుకుంది.  అందరూ ఆకలితో..  ఏమితోచకా ఇంట్లో ఉన్న పక్షులను జంతువులను చంపుకుతినేస్తుంటే మీరు అందరికి హితబోధ చేసి సాహసం చేసి దేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని మీ కలం ద్వారా ప్రజలను వేటగాళ్ళలా మార్చారని ప్రపంచాన్నీ రెచ్చగొట్టిన కవి అని  అతనికి చాలా రకాల బిరుదులు అందచేశారు పురస్కారాలు అందించారు. రామయ్యా ఆకలి భారతం అనే పద్యంతో
ప్రజలను మేలుకొల్పాడు.

సాహసం అనేది వీరులకే  కాదు ప్రజలను చైతన్యవంతులుగా మార్చే కవులకు కూడా ఉందని తెలుస్తోంది ఈ కథ ద్వారా...

   ముఖ్యగమనిక -     భవిష్యత్తును నెగటివ్ గా చూపించినందుకు పాఠకులు క్షమించగలరు. భవిష్యత్తు లో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక మాత్రమే .   నమస్కారాలు.......


Comments

Popular posts from this blog

Modern culture is spreading its wings over the old indian culture...

అమ్మ మనల్ని ఎప్పుడూవెంటాడే ఉద్వేగం (emotion)...

Uranium mining in nallamala@do indian government have any idea to splash The both telugu states:;