వేదాంతమా....?వైరాగ్యమా....!(ఒక్క సారి చదవండి ఖచ్చితంగా నచ్చుతుంది)
వేదాంతమా....?
వైరాగ్యమా....!
నిరాశా.....!
నైరాశ్యమా.....@
ఏమో
ఏదో
వేదాంతమా...! వైరాగ్యమా....@
తెలీదు
దారి తెలీనీ నావలాంటిది నా ప్రయాణం....
ఏమిటి ఈ జీవిత గమ్యం....!
ఎందాకా నా గమనం....@
చివరికి మిగిలేది ఏమిటి....!
ఆత్మ కి మరణం లేదంటాయి వేదాలు, ఉపనిషత్తులు....
చినిగిన చొక్కా (వస్త్రం) వదిలి వేసి కొత్త చొక్కా (నూతన వస్త్రం) ధరించినట్లు "ఆత్మ" మరో శరీరం ధరిస్తుంది అంటుంది భగవద్గీత....@
నిజమేనా
జీవితం బుద్భుద ప్రాయం అంటారు...
(నీటి మీద బుడగ వంటిది.అది (ప్రాణం) (ఎప్పుడు పోతుందో తెలీదు )
ఒంటరిగా వస్తాం....
ఒంటరిగానే పోతాం....
మరెందుకు ఈ ప్రాకులాట....
ఆరాటాలు....
పోరాటాలు....
ప్రయత్నాలు....
అవమానాలు....
ఛీదరింపులు...
ఛీత్కారాలు....
వెక్కిరింపులు .....
వేదనలు....
విలాసాలు....
వ్యామోహాలు....
వ్యక్తిత్వ వికాసాలు....
పగలు....
ప్రతీకారాలు...
మోసాలు.....
మంత్రాలు.....
యంత్రాలు...
తంత్రాలు....
కుతంత్రాలు....
కక్షలు .....
కార్పణ్యాలు....
క్రోధాలు....
మాటలూ- చేతలూ....
చాలా వరకు మోసమే
అన్నింట్లో మాయే....
సంసారం....
సన్యాసం...
అందులో ఓ భాగమే....
ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు,
కొన్ని వందల మంది కన్నీటితో కొన్న కారు,(కొందరికి మాత్రమే)
మాయలు....
అత్యంత అందమైన అలంకరణ కలిగించే ఆభరణాలు,
💰 లు దాచే వాలెట్,
ఎంతో మందిని మోసం,మాయ చేసి పోగుచేసిన కరెన్సీ....(కొందరికి మాత్రమే)
బీరువాల నిండా ఉన్న బట్టలు,
ఎంతో ముచ్చటపడి కొన్న కోట్లు,(coats)
ఇన్ని వందల సంపాదన
కాలం ఖర్చు చేసి కూడబెట్టిన కరెన్సీ....
మానవత్వం మరిచి సంపాదించిన సొత్తు....
ప్రాణాలు పోయినా వదలనేని వ్యామోహం....
మత్తు,...
అంతా భ్రమ....
చివరికి వెళ్ళేటప్పుడు చిల్లిగవ్వ కూడా తీసుకుపోం....
మరలా మరో జన్మ ఉందనుకోవడం మన ఉపశమనం కోసం....కర్మలు, మాసికాలు
మనిషిని మనిషిగా చూడని సమాజాన్ని నేను వదిలేస్తున్నా....
నా కంటూ ఓ కొత్త బంగారు లోకాన్ని నిర్మిస్తా.....
కొంత సమయం పడుతుంది....
మానవత్వం అగ్రస్థానం కల్పిస్తా....
ఆనందం కి అగ్రతాంబూలం అందిస్తా....
మంచికి రోజులు తెస్తా....
ప్రతీ మనిషికి ఓ విలువ ఏర్పరుస్తా.....
Everyman has his price
అత్యాశ,దురాశ అటకమీద కి ఎక్కిస్తా....
నాకంటే (ఉన్నతుడిని) /శ్రేణుడిని/ (మెరుగైన వాడిని) మరియు
తక్కువ రకం వాడిని ,
నీవు కనుగొనవచ్చు.... కానీ అచ్చం "నాలాంటి వాడిని" మాత్రం నీవు కనుక్కోలేవు....@
@@@@@##
నాకంటూ ఓ లోకం
నాదంటూ ఓ ప్రపంచం
ప్రయత్నం చేస్తా....
ఏమో......
నాకా సామర్థ్యం ఉందా......
నా వంతు ప్రయత్న లోపం లేకుండా చేస్తా...
ఆ తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది..
ఒకప్పుడు అన్నింటి మీద ఆశ ఉండేది.
ప్రతి పని మీద ధ్యాస ఉండేది.
ఏమనుకున్నాను...!
ఏం జరుగుతుందో...!
ఎలా జరుగుతుందో..!
ఎందుకు జరుగుతుందో.!
ఊహకందకుండా ఉంది.
ఆనందం కోసం కోట్లు కావాలా.?
సుఖ నిద్ర నిద్రించే సగటు పౌరుడిని అడుగు...
జానెడు పొట్ట కోసం అన్ని వేషాలు అవసరమా?
పంచభక్ష్య పరమాన్నం భుజించే వారికే నా తీరేది ఆకలి...
పచ్చడి మెతుకులు తిని కడుపు నింపుకునే కష్టజీవిని అడుగు అన్నం రుచి, ఆకలి విలువ.
ఉండడానికి ఇంత గూడు కట్టుకున్న చాలు.
కొన్ని వందల మందికి చెందాల్సిన భూమి నీవొక్కడివే అనుభవిస్తే నీకు చివరికి మిగిలేది ఏమిటి....!
పూరి గుడిసెలో నివసించే వ్యక్తి ఉన్నంత నిశ్చింతగా
డూప్లెక్స్ ,డబుల్ , ట్రిబుల్ బెడ్రూమ్ లలో ఉండేవారు ఎందుకుండరు....@
ఏమో
ధనవంతులకి ఎప్పుడూ insecure feeling ఉంటుంది...
ఇంతకష్టపడి రూపాయి , రూపాయి కూడబెట్టిన ఆస్తి ఎప్పుడు ఎవ్వరు దొంగిలిస్తారేమో అనే భయం నిత్యం నీడలా వెంటాడుతుంది....
మనఃశాంతి ని దూరం చేస్తుంది...
నిద్ర సరిగా ఉండదు..
ఆహారం రుచించదు...
ఆలోచనలు కుదురుగా ఉండవు...
నిత్యం డబ్బు గురించిన ఆలోచనలే.....
ఓ పండుగ ఉండదు.
ఓ పబ్బం ఉండదు...
డబ్బు
డబ్బు
డబ్బే
డబ్బే ఓ రోగంగా మారుతుంది...
సమయానికి సరిగా తినక కడుపులో
గ్యాస్ ఫాం అవుతుంది...
స్వీట్ తినాలంటే షుగర్,
హాట్ తినాలంటే అల్సర్,
తృప్తిగా నిద్రించాలంటే నిద్రలేమి...
ఇంకెందుకా.... జీవితం....
అంతా తెలుసుకునే సరికి
ఆరోగ్యం చేదాటిపోతుంది...
సరిగా తిని , తినక పెట్టిందంతా ఆస్పత్రిలో వైద్యం నిమిత్తం ఖర్చు చేస్తారు...
"దానం ఐతే చేయరు కానీ దండగ పెడతారు "
అందుకే నేనంటాను
ఉన్న కొంత కాలమైనా కడుపు నిండా
తృప్తిగా తినాలని,
సుఖంగా నిద్రించాలి...అని
ఆ తర్వాత మీ ఇష్టం మీదే...
ఆహారం మీదే శ్రద్ధ పెడితే
మందులు తీసుకునే అవసరం ఉండదు...
వైద్యం నిమిత్తం వేలకు వేలు , లక్షలు , కోట్లు పెట్టి మందు బిళ్లలు మింగాల్సిన పని ఉండదు అనేది నా అభిప్రాయం ...@
@@@@@@@
ఏ చెట్టు అయినా ,
ఎంత పెద్ద మహావృక్షం అయినా వేర్లు భూమిలోనే
ఉంటాయి....
కానీ
కొందరు మానవులకి
తమ అందం చూసుకొనో,
ఐశ్వర్యం చూసుకొనో,
ఉద్యోగం చూసుకొనో
అహంకారంతో కాళ్ళు నేలమీద లేకుండా ప్రవర్తిస్తారు...
ఆపదలో ఆదుకున్న వారిని చీధరించుకుంటారు...
కష్టాల్లో సహాయపడిన వారిని దూరం చేసుకుంటారు...
కాళ్ళు నేల మీద నిలబడవు...
చూపు ఆకాశం పైన ఉంటుంది...
ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం మరుస్తారు...
"ఓడలు బళ్ళు,
బండ్లు ఓడలు "అవ్వడానికి ఎంతో సమయం పట్టదని మరచి ప్రవర్తిస్తారు....
ఒకే ఒక్క దెబ్బ చాలు...
వీరికి జ్ఞానోదయం కావడానికి,
అజ్ఞానంతో మూసుకున్న కళ్ళు తెరుచుకోవడానికి,
విలవిల్లాడిపోతారు...
పాత పరిచయస్తులని వెతికి వెతికి పట్టుకుంటారు...
మన్నింపు కోరతారు...
వీరు చేసిన హేళనలు , అవమానాలు మరచి కొందరే వీరి స్నేహాన్ని ఆహ్వానిస్తారు...
దాదాపుగా చాలా వరకు వ్యతిరేకత చూపుతారు...
"ఎంత పాలు పోసినా వేపాకులో చేదు ఎలా పోదో అహంకారులు అంతే చచ్చినా మారరు...."
@@@@@@@
ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే
ఛీ ఇంత రోత సమాజంలోనా
మనం జీవించేది
అనిపిస్తోంది....
కామం(కోరిక) కోసం కన్న బిడ్డను బలి చేస్తున్న అబలలు,
ఎక్కడ తమ రంకు బైటపడుతుందేమో అన్న భయంతో తమ బిడ్డల పాలిట మృత్యు దేవతలు అవుతున్న తల్లిదండ్రులు....
తను పెంచి పోషించిన
పిల్ల పెళ్ళి విషయంలో తన మాట వినలేదని
కసాయి గా మారి గొంతు కోస్తున్న తండ్రులు
లేదా
కొంతకాలానికి మరో కుల/మతస్తుడిని వివాహం ఆడిందని ఆదరించి కూతురు ,అల్లుడు ల ఉసురు తీస్తున్న కన్నవారు....
ఏమిటీ సమాజం....
ఇదేం నాగరికత....
ఇదేం పోకడ....
ఇదేం మూర్ఖత్వం.....
ఎంత మంది
రాజారాం మోహన్ రాయ్ లు,
కందుకూరి వీరేశలింగం పంతులు ,
రావాలి...
ఇంకా ఎంత మంది వచ్చినా వీరు మారరు....
మాకు చెప్పేటంతడి వాడివా నీవు...
నీ పని నీవు చూసుకో బే...
అంటూ తిట్ల దండకం అందుకుంటారు...
అందుకే
"మందలో ఒకడిగా,
గుంపులో గోవిందా గా మారిపోవడం మంచిది..."
వంద మంది భగత్ సింగ్ లు,
వేల మంది వివేకానంద లు,
లక్షల గాంధీలు వచ్చినా
మారదు లోకం....
మార్పు అనివార్యమైనప్పటికీ మారదు లోకం....
మారదు జనాల తీరు....
మార్చడం నీ తరం కాదు...
@@@@@@@
బంధాలన్నీ బూటకమే
మనుషులంతా నటనే
బ్రతుకంతా నాటకమే
జీవితం రంగస్థలమే..
ఎందుకోసం ఈ ఆరాటం
దేనికోసం ఈ పోరాటం
తెలియని ప్రయాణం
చేరలేని గమ్యం..
ప్రతిక్షణం ఆందోళనే
అనుక్షణం ఆవేదనే
అర్ధంకాని పరిచయాల
నిన్ను పుట్టించిన వారి తరం కూడా కాదు...
బిడ్డలుగాటి సమాజంలో ముఖ్యాంశాలు....
ఇదే నేటి ఆధునిక అత్యాధునిక సాంకేతిక నాగరికత సమాజం....@
అర్థంలేని అపార్ధాలు..
అరక్షణం ఆవేశం
మరుక్షణం ఆరాధన
పదే పదే క్షమాపణలు
పరిపరి విధాల తిరస్కారాలు..
ఏంటో జీవితం
అర్ధమైనట్టు ఉంటుంది
అర్ధం కానట్టు అనిపిస్తుంది
అర్ధమయ్యేలోపు ముగుస్తుంది..
బంధాల నడుమ మనసులు
బంధీ అయిన జీవితాలు
బరువు,బాధ్యతల నడుమ
ప్రతి గడియ భారమే..
ప్రతి రోజూ అలుపెరుగని పోరాటమే...
దిన దినం గండమే...
క్షణ క్షణం క్షణికమే...
@@@@@@@@
భగవంతుడు రెండుసార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుకుంటాడంట....
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డ కు వైద్యం చేస్తూ , వైద్యుడు వాళ్ళ తల్లితో ఏం భయం లేదమ్మా....!
మీ అబ్బాయి ని నేను బతికిస్తా ....@
అన్నప్పుడు........
మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమి పంచుకొని
ఇదిగో ఈ భూమి నాది
అటువైపు ఉన్నది నా తమ్ముడి ది....
"అన్నప్పుడు "
వీడి తండ్రి, తాత ఇదే మాట అన్నారు....
పోయారు....
ఇప్పుడు వీడూ అదే మాట అంటున్నాడు..
రేపు వీడూ పోతాడు....
అయినా ఇది నాది...
అనే భ్రమ లో , మాయలో , అజ్ఞానంలో
బ్రతుకుతున్నాడు....!
అని నవ్వుకుంటాడంట దేవుడు..........@
నిజమే
ఏదీ శాశ్వతం కాదు....
మనం , మన పిల్లలు,
మనం సంపాదించుకున్న ఇల్లు,
భూమి, మన బ్యాంకు బ్యాలెన్స్
ఏవీ మనవెంట రావు.......
ఈ విషయం మనం అందరికీ తెలుసు...
అయినా నాది, నావి అనే మాయలో ఉండిపోతున్నాం....
ప్రతిరోజూ తెల్లవారుతుంది....
పగలు వెళ్ళిపోతుంది...
రాత్రి మోదలౌతుంది...
తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతుంది...
పగలు తిరగడం, రాత్రిళ్ళు నిద్రపోవడం ఎన్నాళ్ళు ఇలా...
ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం....
తాగిందే తాగుతున్నాం....
రోజూ అదే తిండి....
అదే నీరు....
అదే మంచం....
అదే నిద్ర.....
అయినా ఎందుకో వాటి మీద
ఆశ చావడం లేదు...
దుఃఖం తొలగడం లేదు...
ఏ మాత్రం అర్థం కాని
ఈ రాత్రి - పగలు అనే ప్రయాణం చివరికి ఎక్కడికి అని ఆలోచిస్తుంటే.....
ఈ ప్రయాణం ఒకరోజు "*చావడం*" దగ్గరికి తప్ప మరొక చోటికి కానే కాదని తెలుస్తోంది...
ఇక్కడ పుట్టేదంతా. ఒకనాటికి తప్పక నశించేదే...
అయినప్పుడు
ఈ దుఃఖం దేనికి.....?
ఈ ఆరాటం దేనికి....?
మనలో ఏర్పడి ఉన్న నాది, నావి, నా వాళ్ళు అనే ఈ భ్రమంతా ఎక్కడి నుంచి వచ్చింది.....!
ఈ జీవితమంతా " మూన్నాళ్ళ ముచ్చట" అని తెలుస్తున్నప్పుడు మనమెందుకు ఇలా ఆలోచిస్తున్నాం....
డబ్బు 💸💰💰💰 సంపాదించాలి...
దాన్ని భద్రంగా దాచుకోవాలి....
అందరి కంటే "గొప్పవాళ్ళం" అయిపోవాలి అని పిచ్చి....
ఇదంతా "పిచ్చి" కాకపోతే ఇంకేంటి....
ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి....
ఈ శరీరం పుట్టేట్టప్పుడు...
ఈ శరీరం పెరిగేటప్పుడు...
ఈ శరీరం పోయేటప్పుడు...
ఏదైతే మార్పనేది లేకుండా ఈ శరీరం లో
ఉందో అదే "ఆత్మ"........
ఆ ఆత్మే నేను అనే ఎరుక కలిగిననాడు మనలో
"ఆత్మ జ్ఞానం" ఉద్భవిస్తుంది....
జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం.....
దాని తర్వాత భక్తి....
భక్తి కి పరాకాష్ట భగవంతుని దర్శనభాగ్యం....
@#"చివరికి ముక్తి""#@
"ముక్తి" పొందడానికే దైవం మనకు మానవ జన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి.
.
"మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేవు...
మన మనసులోనే ఉంది.....
ఆలోచించండి....
Comments
Post a Comment