గమ్యమే కాని గమనం లేనిది నేటితరం యువత.
గమ్యమే కాని గమనం లేనిది నేటితరం యువత.
కోరికలే కాని కర్తవ్యనిష్టలేని మానవ జాతి.
ప్రేమ పొందటమే కాని పెళ్ళి గురించి ఆలోచనలేని అమాయకులున్న తరం.
మార్గం తెలిసిన తీరం చేరని నావలెన్నో.
ప్రయత్నం చేసి ఫలం పొందలేని నరులెందరో....
నా దృష్టిలో అతి ముఖ్యమైనవి , విలువైనవి
డ, మా,కా
వీటికే అగ్రస్థానం .
డ :- 💰
మా :- మాట
కా :- కాలం
ఇవి అతి ముఖ్యమైనవి.
చేజారిపోతే తిరిగిరావు.
అతి జాగ్రత్తగా వాడుకోవాలి.
నేటి సమాజంలో డబ్బుంటేనే విలువ.
డబ్బు, కాలంతో పాటు మాటలు కూడా ముఖ్యమైనవి. పొదుపుగా వాడుకోవడం మంచిది.
ఒక్క చిన్న నింద మాట వల్ల బ్రతుకుదాం అనుకున్నోడు చస్తాడు.
మరో చిన్న ప్రేరణ, సాంత్వన వాక్యం వల్ల చద్దామనుకొనేవాడు ప్రేరణ పొంది బ్రతుకుతాడు.
మాటలు వల్లనే మిత్రులు శత్రువులు,
శత్రువులు మిత్రులు అవుతారు.
మాటలు కూడా కాటాలో తూచినట్లు పొదుపుగా ఆచితూచి మాట్లాడాలి.
మంచి మాటలు ద్వారా కూడా మనకు లేని విలువ వస్తుంది.చెడ్డ మాటల ద్వారా ఉన్న విలువ పోతుంది.
మాటలు పువ్వులా మెత్తగా సున్నితంగా లాలిస్తాయి.
కఠినంగా ముల్లు చేసే గాయంలా మనిషి మనసును చిత్రవధ చేస్తాయి.
మాటలు పొదుపుగా వాడాలి.
మాటనిబట్టి కూడా మన గౌరవమర్యాదలు నిర్ణయించబడతాయి.
మాటకు తూటాలాగా కూడా ఎదుటివారి ప్రాణాన్ని హరించే శక్తి ఉంది.
"పని చేసేవాడు ఎక్కువ మాట్లాడడు.
ఎక్కువ మాట్లాడే వాడు ఎక్కువ పనిచేయడు."
మాటలు,చేతలు(పనులు) ఏకకాలంలో సాగవు.
"ఉపవాసం ఉన్నవాడికి ఆకలి విలువ తెలిసినట్లు ,
మౌనవ్రతం ఉంటేనే మాట విలువ తెలుస్తుంది."
ఓ రోజు మౌనవ్రతం ఉండటం వల్ల ఎన్ని వ్యర్థ , వృదా మాటలు మాట్లాడుతున్నామో అర్థమౌతుంది.
మాటలు మంచికే వాడాలి.
చెడు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి.
మనం మాటలతో అవసరమైతే కోటలు కట్టగలగాలి.
ఇంకా అవసరమైతే బూరె లు కూడా వండగలగాలి.
అవసరమైతే మూగవాడిలా (మాటలు రాని వాడిలా) మారిపోవాలి.
గురజాడ అప్పారావు గారు అన్నట్లు
"వోట్టి మాటలు కట్టిపెట్టి
గట్టి మేలు తలపెట్టాలి"
కొన్ని సందర్భాలలో మాటలు కూడా ఆరోగ్యానికి హానికరమే.అట్లాంటి సందర్భాలలో మౌనముద్ర ప్రదర్శించగలగాలి.
తగాదాలలో , గొడవల్లో వాగ్యుద్ధం కి దారి తీయకూడదు.మౌనంగా ఉండటమంత శ్రేయస్కరం మించిన మంచి పనిలేదు.
"మంచి మాటలైతే మైకులో, చెడు మాటలైతే చెవిలో
చెప్పాలి"
నేటికాలంలో మనుషుల్ని మాయ చేయటం కూడా నేర్చుకోగలిగి ఉండాలి.మాయ వేరు మోసం వేరు గమనించగలరు.
చదివినందుకు ధన్యవాదాలు
Comments
Post a Comment