అమ్మ మనల్ని ఎప్పుడూవెంటాడే ఉద్వేగం (emotion)...







అమనల్ని ఎప్పుడూ
వెంటాడే ఉద్వేగం (emotion)...

ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అమ్మతనం లభిస్తుంది అంట....

ఆడవారికి మరో జన్మ అమ్మతనం....

ఎన్ని పనులు చేసినా రుణం తీర్చలేని వ్యక్తి "అమ్మ"

అమ్మ అంటే పెదవులు కలుస్తాయి...

ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ పడే ప్రసవవేదన పడటం మన తరం కాదు...

ఎంత బాధ నైనా భరించి పురిటిలో బిడ్డను చూసి సంతోషించడం కేవలం అమ్మ కే సాధ్యం...

"ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండి 
ముగ్గురు కి సరిపడినంత ఆహారం మాత్రమే ఉంటే నాకెందుకో ఈ రోజు ఆకలిగా లేదు " అని చెప్పగలిగేది కేవలం "అమ్మ" మాత్రమే...

బిడ్డ ఆకలి కనిపెట్టేది అమ్మే...

అమ్మతనం ఆడవారికి ఓ వరం...

అమ్మ ఉంటే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు...

అమ్మ ఉంటేనే ఆ ఇంటికి కళ....

అమ్మను చూసి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు...

అమ్మ ను చూసి సహనం , ఓర్పు నేర్చుకోవచ్చు...

అంత చాకిరీ చేసి ఓ ముద్ద అన్నం తినడానికి అమ్మ కంచం ముందు కూర్చోగానే బిడ్డ పరీక్షించడానికి "ఏడుపు" మోదలెడతాడంట అమ్మ కి నేను ఇష్టమా...?
తిండి ఇష్టమా...? అని మోదటి సమాధానానికే అమ్మ ఓటు...

అమ్మ తినడం ప్రారంభించగానే బిడ్డ 
బాత్రూం పోవడమో, టాయిలెట్ పోయడమో చేస్తాడంట అమ్మకి ఎంత సహనం ఉందో చూడడానికి 
అందులో ఎప్పుడూ అమ్మ దే విజయం...
కొందరు ఒడిలో బిడ్డ ను ఉంచుకొని తినడం ప్రారంభించగానే ఆ కంచంలో బిడ్డ లు ఒకటో , రెండో ఒదిలినా అమ్మ ఓపిక ముందు అవన్నీ తక్కువే.....@

చంటి పిల్లలు ఎంత రోత చేసినా చీదరించుకో నిది అమ్మ ఒక్కటే....

భూమి కంటే భారమైంది ఏది అని యక్షుడు వేసిన
ప్రశ్న కి "తల్లి గర్భం" అని ధర్మరాజు సమాధానం...

"తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుంది" తెలుగు సామెత...

తల్లా...? పెళ్ళామా....?

ప్రశ్న కి సమాధానమే పై సామెత....

@@@@@@@@@@

ఓ సంఘటన మనకు అప్పటి వరకూ ఉన్న అభిప్రాయాన్నే మార్చేస్తుంది....

ఈ మధ్య నేను ఓ ఊరి నుంచి వస్తున్నాను...

రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి ఓ మూడు కిలోమీటర్ల దూరం...

నా దగ్గర ఉన్న లగేజి బరువు సుమారుగా 3-4 కేజీలు ...

నాకు నడక అంటేనే ఇష్టం...

వ్యాయామానికి వ్యాయామం...

అందరిని పరిశీలించే అవకాశం ఉంటుంది అని....

ఓ అరకిలోమీటరు వరకు వచ్చాను...

ఆ లగేజీ ఇంకొంచెం బరువు పెరిగినట్లు ఉంది...
ఇంకొక కి.మీ.  వచ్చాను

ఇంకా ఆ లగేజీ బరువు పెరిగినట్లు ఉంది...

అప్పుడు నాకు అనిపించింది

ఈ చిన్ని లగేజీ నే నడిచే కొద్ది బరువు పెరుగుతూ వస్తోంది కదా " మరి కడుపు తో ఉన్నప్పుడు
" ఆ కడుపులో ఉన్న పిండం / బిడ్డ బరువు రోజురోజుకూ పెరుగుతున్న ఆ బరువును ఎంతో సహనంతో మోసిన మాతృమూర్తికి ఏం ఇచ్చినా మనం తినే రుణం తీర్చుకోలేం....

ఎన్ని అవస్థలు పడుతుందో అమ్మ ఓ బిడ్డ తన కడుపులో ఉన్నప్పుడు....

ఒక్కోసారి తిండి తినడానికి కూడా ఓపిక లేకపోయినా 

నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి అనుకుంటుంది...

అంత బరువు నవమాసాలు మోయడం కేవలం
"అమ్మ" కే సాధ్యం...

ఆ బరువు మోయలేక ఒక్కోసారి కాళ్ళు నొప్పులు,
నడుము నొప్పి,కడుపు నొప్పి.... ఎటువంటి నొప్పులు అయినా ఆనందంగా స్వీకరించడం "అమ్మ" కే సాధ్యం...

తల్లిని మోదటి దైవంగా ఎందుకు చెప్పారో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా...

"మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ"

అమ్మ అనుగ్రహం ఉంటే చాలు ఏ పనైనా సాధ్యమే...

అమ్మ ను మించిన దైవం లేదు ఈ లోకంలో....

@@@@@@@@@

నాన్న చేసిన పనికి వెల కట్టి జీతం వస్తుంది...

అమ్మ చేసే పని వెలకట్టలేనిది...

@@@@@@@@

అందరి కంటే ముందు నిద్రలేచి , ఆఖరిగా నిద్రకి ఉపక్రమించేది కూడా "అమ్మ"

@@@@@@@@@

అమ్మాయి మాత్రమే అమ్మ అవ్వగలదు...
ఈ ఒక్క విషయం చాలదా "ఆడవారి ని" 
గౌరవించాలని కి...

@@@@@@@@@

తన కూతురు లో అమ్మ ని చూసుకునే తండ్రులెందరో...

@@@@@@@

అమ్మ తొలి గురువు....
అమ్మ తొలి దైవం....

అమ్మ తొలి నేస్తం...

అమ్మ తొలి శ్రేయోభిలాషి...

అమ్మ తొలుత హితోపదేశం చేసే ఏకైక వ్యక్తి...

మన ఆలనాపాలనా చూడటంలో అమ్మా
"సరిలేరూ నీకెవ్వరూ"

@@@@@@@@@

ప్రతి ఆడపిల్ల లో అమ్మ ని చూస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అని తెలుసుకున్నాను నేను...

@@@@@@@@

మనం అమ్మ శ్రమని గుర్తించి ఆమె ని గౌరవించాలి...

ఎప్పుడూ మనకి ఇష్టమైన ఆహారమే తయారు చేస్తుంది  అమ్మ..

తన ఇష్టం , కోరిక లు తెలుసుకొని తీర్చడం మన బాధ్యత, ధర్మం....

@@@@@@@@

తన పిల్లలు తనను వదిలి దూరంగా ఉన్నా "నా పిల్లలు సమయానికి తింటున్నారో... లేదో...!
సరిగా నిద్ర పోతున్నారో .... లేదో...!
ఎప్పుడూ మన మంచిని కోరడంలో అమ్మ కి సాటిరారు మరెవ్వరూ....@@@@

ఎందరో తల్లులు అందరికీ వందనాలు....

@@@@@@@@@@@

ఆడవారి ని గౌరవిద్దాం...

దేశప్రగతి కి పాటుపడదాం...

@@@@@@@

ఎక్కడ అయితే ఆడవారు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో ఉంటారంట... ఆ ప్రాంతంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సంతోషంగా ఉంటుందంట..
ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి...

ఒప్పులు ఉంటే పాటించండి....
@@@@@@@

మీ అమూల్యమైన సమయం కేటాయించి చదివినందుకు ధన్యవాదాలు....

  ‌‌





Comments

Popular posts from this blog

Build solid foundation!!

Educational system in our state @telangana