అమ్మ మనల్ని ఎప్పుడూవెంటాడే ఉద్వేగం (emotion)...
అమనల్ని ఎప్పుడూ వెంటాడే ఉద్వేగం (emotion)... ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అమ్మతనం లభిస్తుంది అంట.... ఆడవారికి మరో జన్మ అమ్మతనం.... ఎన్ని పనులు చేసినా రుణం తీర్చలేని వ్యక్తి "అమ్మ" అమ్మ అంటే పెదవులు కలుస్తాయి... ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ పడే ప్రసవవేదన పడటం మన తరం కాదు... ఎంత బాధ నైనా భరించి పురిటిలో బిడ్డను చూసి సంతోషించడం కేవలం అమ్మ కే సాధ్యం... "ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండి ముగ్గురు కి సరిపడినంత ఆహారం మాత్రమే ఉంటే నాకెందుకో ఈ రోజు ఆకలిగా లేదు " అని చెప్పగలిగేది కేవలం "అమ్మ" మాత్రమే... బిడ్డ ఆకలి కనిపెట్టేది అమ్మే... అమ్మతనం ఆడవారికి ఓ వరం... అమ్మ ఉంటే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు... అమ్మ ఉంటేనే ఆ ఇంటికి కళ.... అమ్మను చూసి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు... అమ్మ ను చూసి సహనం , ఓర్పు నేర్చుకోవచ్చు... అంత చాకిరీ చేసి ఓ ముద్ద అన్నం తినడానికి అమ్మ కంచం ముందు కూర్చోగానే బిడ్డ పరీక్షించడానికి "ఏడుపు" మోదలెడతాడంట అమ్మ కి నేను ఇష్టమా...? తిండి ఇష్టమా...? అని మోదటి సమాధానానికే అమ్మ ఓటు... అమ్మ తినడం ప్రారంభించగానే బిడ్డ బాత్రూం పోవడమో, టాయిలెట్ పోయడ...